Social Empowerment Programme (సామాజిక సమతా సంకల్పం కార్యక్రమం)-18.01.2024

గణపవరం స్థానిక శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS యూనిట్ 1&2 ల ఆధ్వర్వంలో కమీషనరు కళాశాల విద్య వారి ఉత్తర్వుల మేరకు సామాజిక సమతా సంకల్పంలో భాగంగా కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ డా.పి. నిర్మల కుమారి గారు కళాశాల ఆవరణలో ఉండే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గా ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, అధ్యాపకుడు, రాజకీయ నేత, సంఘ సంస్కర్తనీ, ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడనీ, స్వతంత్ర భారతదేశపు మొట్ట మొదటి కేంద్ర న్యాయ శాఖమంత్రిగా పని చేశాదనీ, రాజ్యాంగ శిల్పిఅనీ న్యాయ, సామాజిక, ఆర్థికశాస్త్రాలలో పరిశోధనలు చేశాడనీ, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడనీ, తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక, రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడనీ కొనియాడారు. ఈ కర్యక్రములోవైస్ ప్రిన్సిపల్ శ్రీ.పీ మధు రాజు గారు, IQAC కోఆర్డినేటర్ డా. టి. అక్కిరాజు గారు,కళాశాల అధ్యాపక సిబ్బంది డా.సిహెచ్ అనూరాధ డా.జి.వెంకట్రావు,డా.కే.స్వరూప రాణి, NVNB శ్రీనివాసరావు,డా. G. వెంకటరమణ, శ్రీ. పి. భాస్కర్ రావు,మొయిన్ అన్సారి, కెవి గణేష్ కుమార్,షేక్ పర్వీన్,బాల మణికంఠ, రేవతి,వెంకన్న బాబు అధ్యాపకేతర సిబ్బంది దేవా,విగ్నేష్, ప్రసాద్,సంధ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. NSS యూనిట్ 1&2 ప్రొగ్రామింగ్ ఆఫీసర్స్ డా.జి. వెంకట రమణ పి. భాస్కరరావు లు ఈ కార్యక్రమాల్ని నిర్వహించారు.