అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ఫిబ్రవరి 21.2023 వ తేదీన తెలుగు శాఖ & తెలుగు సాహితీ సమాఖ్య తాడేపల్లిగూడెం సంయుక్త ఆధ్వర్యంలో సెమినార్ హాల్ GDC గణపవరం లో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథి గా వచ్చిన పుచ్చకాయల బ్రాహ్మజీ రావు గారు మాతృ భాష ప్రాముఖ్యతను తేనెలొలుకు భాష తెలుగు, మన అమ్మ భాషఅనీ వివరించారు. తదనంతరం సాహితీ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ పి మధురాజు గారు అధ్యక్షులుగా వ్యవహరించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. DRG ప్రభుత్వ డిగ్రీ కళాశాల తాడేపల్లిగూడెం వారు నిర్వహించిన సాహిత్యంలోకి అనే జాతీయ సెమినార్ లో మన కళాశాల నుంచి 18 మంది విద్యార్థులు పత్ర సమర్పణ చేశారు. పది మంది విద్యార్థుల పేపర్లు ఉత్తమ పరిశోధన పత్రాలుగా ఎంపికయ్యాయి. ఒక్కొక్కరికి Rs:500/- చొప్పున బహుమతి ఇవ్వడం జరిగింది.




