SVEEP-Electoral Literacy Programme 02.01.2024

స్థానిక శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ -I & II మరియు ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్  ల ఆధ్వర్యంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ (Systematic Voters Education & Electoral Participation-SVEEP) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మల కుమారి గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.  ఈ కార్యక్రమానికి గణపవరం మండల ఎంపీడీవో శ్రీ జ్యోతిర్మయి గారు ముఖ్య అతిధి గా విచ్చేసి యువతరం ఓట్లు ప్రగతికి మెట్లు అనే స్లోగన్ తో 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఓటు వేయాలని చెప్పారు.మన భవిష్యత్ మార్చే ఆయుధం ఓటు అని విద్యార్థులను చైతన్యపరిచారు.ఎలక్ట్రోలర్ లిటరసీ క్లబ్ కోఆర్డినేటర్ డా.జి.వెంకట్రావు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరారు.ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆఫీసర్ డా.జి.వెంకటరమణ మాట్లాడుతూ ఏ ప్రలోభాలకు లొంగకుండా నైతిక విలువలతో కూడిన ఓటింగ్ వైపు పయనించాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కామర్స్ అధ్యాపకులు శ్రీ ఎస్. వెంకన్న బాబు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.