Field Trip to Dindi & Antarvedi-17.02.2024

The students of our Ganapavaram Government Degree College (B.A, B.Com, B.Sc second year) went on an excursion to Narasapuram, Dindi, and Antarvedi on 17.02.2024. Initially, the students visited the Lace Factory in Narasapuram. They observed the knitting work in the factory. Afterward, they had a breakfast in the midst of green fields with the warmth of the sun’s rays shining through. Nearby, they enjoyed the cool breeze by the river.

Following this, the students visited the Ambedkar Konaseema district, Coconut Groves, and the cheerful Dindi Resorts. During the excursion, they visited the meeting point of the Godavari River and the sea, a place where life and the world blend harmoniously with the ocean.

With such experiences, the science journey of the students came to an end. During this science journey, Dr. G. Venkatrao, Lecturer in Social Work, Dr. G. Venkataramana, Lecturer in Telugu, Sri P. Bhaskar Rao, Lecturer in History, Mrs. B. Rani, Lecturer in Commerce, Sri S. Venkanna Babu, Lecturer in Commerce, Sri P.V. Ramesh, Lecturer in Computer Applications, Smt P. Swathi, Lecturer in Physical Education , Non-teaching staff member Sri B.S.P. Prasad accompanied the students.

In this academic year, the students have shown special interest and enthusiasm for science and excursions. Our heartfelt thanks to our principal Dr. P. Nirmala Kumari on behalf of all students for the support in organizing the journey.

ఈ రోజు మన గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులందరూ (బిఏ,బీకాం, బిఎస్సి రెండవ సంవత్సరం) నరసాపురం,దిండి,అంతర్వేది స్థలాలకు విహారయాత్రకు వెళ్లడం జరిగింది.మొదట నరసాపురంలో ఉన్న లేస్ ఫ్యాక్టరీని విద్యార్థులు సందర్శించడం జరిగింది.అక్కడ జరుగుతున్న కుట్లు అల్లికల పనులు చూశారు. తర్వాత అల్పాహారం కోసం పచ్చని పొలాల మధ్యలో,మంచు పొరలు తెగుతూ సూర్యకిరణాలు తొలుచుకుంటూ వస్తున్న స్థలంలో ఆగాము.పక్కనే పారుతున్న పొలం కాలువ.    తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొబ్బరి తోటల్లో,ఆహ్లాదకరంగా ఉండే,దిండి రిసార్ట్స్ ను సందర్శించడం జరిగింది.పక్కనే పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న  గోదావరి పిల్ల అలల సవ్వడులు, మృదువుగా వీచే చల్ల గాలుల మౌన భాషలు విద్యార్థులు అస్వాదించి పరవశించారు. విహారయాత్రలో చివరిగా అంతర్వేది సముద్ర బీచ్ ని అలాగే గోదావరి నది సముద్రంలో కలిసే సంఘమ స్థలాన్ని సందర్శించడం జరిగింది. జీవితాన్ని లేదా సంసారాన్ని సముద్రంతో పోలుస్తారు.అలాంటి సముద్రంలో  ఎగసిపడే అలలు,స్థిరంగా నిలకడగా ఉంటే ఒడ్డు, సముద్రపు అంతర్గర్భంలో దాగిన బడబానలం, అన్నింటినీ మరిపించే స్నేహితులతో దిగే చిత్రమాలికలు.ఇలా కేరింతలతో విద్యార్థుల విజ్ఞాన యాత్ర ముగిసింది.ఈ విజ్ఞాన యాత్రలో డాక్టర్ జి వెంకట్రావు సోషల్ వర్క్ శాఖ అధ్యక్షులు, డాక్టర్ జి వెంకటరమణ తెలుగు శాఖ అధ్యక్షులు,పి.భాస్కర్ రావు చరిత్ర శాఖ అధ్యక్షులు, శ్రీమతి బి రాణి దుర్గ కామర్స్ శాఖ అధ్యక్షులు,ఎస్ వెంకన్న బాబు కామర్స్ అధ్యాపకులు, పివి రమేష్ కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు, పి స్వాతి ఫిజికల్ డైరెక్టర్, బిఎస్పీ ప్రసాద్, బీఎస్సీ రెండవ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులందరూ 42 మంది పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులను విజ్ఞాన,విహారయాత్రలకు ప్రత్యేకించి శ్రద్ధ చూపించి,ప్రోత్సహిస్తున్నటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. నిర్మల కుమారి గారికి స్టాప్ అందరి తరపున, విద్యార్థులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వెంకట్రావు గారికి,  భాస్కర్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.భోజనం విషయంలో ట్రాన్స్పోర్ట్ విషయంలో శ్రద్ధ తీసుకొని చక్కగా, జాగ్రత్తగా అందర్నీ ముందుండి నడిపించారు. అందరికీ ధన్యవాదాలు.