International Mother Language Day-21.02.2024

స్థానిక శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు (21.02.2024) తెలుగు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ.పీ.మధు రాజు గారు అధ్యక్షత వహించారు. విద్యార్థులందరూ తెలుగు భాష పట్ల అవగాహన పెంచుకోవాలంటే తప్పనిసరిగా తెలుగు న్యూస్ పేపర్స్ ను చదవాలని విద్యార్థులకు సూచించారు. తెలుగు భాష సాహిత్యం రెండూ గొప్పవని IQAC కోఆర్డినేటర్ డా.సిహెచ్. చైతన్య గారు పేర్కొన్నారు. మాతృభాషలో పట్టు సాధించినప్పుడే ప్రపంచంలో ఏ ఇతర భాషనైనా సులభంగా నేర్చుకోవచ్చని డాక్టర్ T. అక్కిరాజుగారు పేర్కొన్నారు. తెలుగు శాఖ అధ్యక్షులు డా.జి. వెంకటరమణ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత అందమైన లిపి,కలిగినటువంటి భాష తెలుగు భాషని కొనియాడారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన సాహిత్య పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. జి. వెంకటరావు ,శ్రీ పి భాస్కర్ రావు, షైక్ పర్వీన్,రమేష్, బాబు,ధ్యాపకేతర బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.సంబంధిత ఫోటోలు.