Babu Jagjivan Ram Birth Anniversary-05.04.2024

స్థానిక శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS UNIT I & II ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించటం జరిగింది. ఈ సమావేశానికి వైస్ ప్రిన్సిపల్ శ్రీ పీ. మధురాజుగారు అధ్యక్షత వహించి, బాబూ జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు.
NSS UNIT-I ప్రోగ్రాం ఆఫీసర్ డా. జి వెంకటరమణ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ బీహార్‌లోని అర్రాలో చాంద్వాలో భారతీయ కుల వ్యవస్థ యొక్క CHAMAR కులంలో జన్మించాడనీ, భారత స్వాతంత్ర్య కార్యకర్తనీ,మరియు బీహార్‌కు చెందిన రాజకీయ నాయకుడనీ,అతను 1935లో అంటరానివారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనలో కీలకపాత్ర పోషించాడనీ, 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడనీ , గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడనీ, జవహర్‌లాల్ నెహ్రూ యొక్క తాత్కాలిక ప్రభుత్వంలో అతిచిన్నవయసులోమంత్రయ్యాడనీ,భారతదేశఉపప్రధానమంత్రిగా పనిచేశాడనీ, బడిలో,సమాజంలోకులవ్యవస్థనూ,అంటరానితనాన్ని నిరసించాడనీ, కార్మిక మంత్రిగా భారతదేశం యొక్క మొదటి క్యాబినెట్ మరియు భారత రాజ్యాంగ సభలో సభ్యుడు కూడా అయ్యాడనీ కొనియాడారు.
బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పొటీలో ప్రథమ, ద్వితీయ,తృతీయ స్థానాల్లో నిలిచిన మౌనిక,లక్ష్మి,సత్యశ్రీ కి బహుమతి ప్రదానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది ఐ.క్యు.ఏ.సీ కోఆర్డినేటర్ డా.సిహెచ్.చైతన్య, డా.టి.అక్కిరాజు , డా.కె.స్వరూప రాణి, NVNB శ్రీనివాసరావు, డా.జి వెంకట్రావు, మొయిన్ అన్సారి, షేక్ పర్వీన్, రాణి దుర్గ, బాల మణికంఠ , వెంకన్నబాబు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Click here for REPORT