Kavitho Karachalanam…(కవితో కరచాలనం) 21.11.2023

స్థానిక గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  తెలుగు శాఖ మరియు ఎకో క్లబ్  ఆధ్వర్యంలో కవితో కరచాలనం అనే కార్యక్రమమును నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిత్రగ్రీవం పాఠ్యభాగ రచయిత శ్రీ దాసరి అమరేంద్ర విద్యార్థులతో ముచ్చటించారు. సుమారు 12 దేశాలు పర్యటించిన అనుభవం, సుమారు మూడు వేల కిలోమీటర్లు దక్షిణ భారతదేశమంతా బైక్ మీద యాత్ర చేయడం, ఉత్తర భారత దేశంలో చాలా స్థలంలో బైక్ ప్రయాణం చేయడం అమరేంద్ర గారి కొన్న ప్రవృత్తి లక్షణాలు. వృత్తి రీత్యా ఇంజనీర్ అయినప్పటికీ సాహిత్యంలో ఉన్న యాత్ర చరిత్రలు అంటే చాలా ఇష్టమని,యాత్రలు చేయడం అంటే చాలా ఇష్టమని తెలిపారు.  ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్  శ్రీ పి.మధు రాజు గారు ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ జివి రావు గారు, డాక్టర్ సిహెచ్ చైతన్య డాక్టర్. షేక్ పర్వీన్,డాక్టర్. జి వెంకటరమణ, ఎన్ వి ఎన్ బి శ్రీనివాసరావు అధ్యాపకేతర బృందం విద్యార్థిని విద్యార్థులు అందరు పాల్గొన్నారు.