Nannaya Univ. Inter-College Chess 14-15 Nov. 23

గణపవరం, చింతలపాటి మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర కళాశాలల చదరంగం పోటీలలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ సభలో ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పుప్పాల వాసుబాబు గారు ముఖ్య అతిధిగా విచ్చేసి,ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నదని, ఆంధ్రప్రదేశ్ ని క్రీడాంధ్ర ప్రదేశ్ గా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదేనని అన్నారు. ప్రతి విద్యార్ధి, విద్యార్థినులు అన్ని స్థాయిలలోని వారు చదరంగంపై మక్కువ పెంచుకునే విధంగా పాఠశాల స్థాయి నుండే చదరంగం ఆటలు ఉపయోగపడుతాయని అన్నారు. చదరంగం ఆట వలన మెదడు చాలా చురుకుగా పనిచేసి చదువులో ముందు ఉండుటకు దోహదం చేస్తుందని, చదరంగం అనేది మైండ్ తో ఆడే ఆట అని బలంతో కాదని అందుకే ఇందులో గెలిచిన వారిని గ్రాండ్ మాస్టర్ అంటున్నారు.

ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మల కుమారి గారు అధ్యక్షత వహించారు. MLA గారికి పూల మొక్కతో ఘనంగా విద్యార్థులు స్వాగతం పలికారు.ఈ పోటీలలో విజేతలైన అమ్మాయిలు ఆరుగురు, జిషిత డి, ఎం గాయత్రి, కే విష్ణు శ్రీ సాయి ప్రియ,విశ్వ శ్రీ,హర్షిత భాను తేజశ్రీ అబ్బాయిలు ఆరుగురు దివ్య తేజ, కిరణ్ సుందర్, మణికుమార్, ఎస్ వరప్రసాద్, జి. గంగాధర్, ఎం నవీన్ డిసెంబర్ నెల నాలుగో వారంలో తమిళనాడులో జరగబోయే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లో పాల్గొంటారు.ఆదికవి నన్నయ యూనివర్సిటీ టీం ఛాంపియన్షిప్ మెన్ విభాగంలో మెన్ ఫస్ట్ ప్లేస్ పి ఆర్ జె సి కాకినాడ, రెండో స్థానం ఎస్వికెపి పెనుగొండ, మూడోస్థానం బివి రాజు భీమవరం, ఉమెన్ విభాగంలో మొదటి స్థానం ఎస్ వి కే పి పెనుగొండ, రెండవ స్థానం బి.ఆర్ అండ్ జికేఆర్ ఛాంబర్స్ కాలేజ్, మూడో స్థానం బివిఆర్ రాజు కాలేజ్ భీమవరం గెలుపొందారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో పీడీగా పనిచేస్తున్న శ్రీమతి స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ గారు ముందుండి ఈ పోటీలకు సంబంధించిన అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించారు. కళాశాల ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ సెక్రటరీ కాకర్ల విష్ణు శ్రీనివాసరావు గారు, శ్రీరామ్ గారు, సత్యనారాయణ రాజు గారు, అవంతి సత్తిబాబు గారు, విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన భోజన వసతి ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ పి.మధు రాజు గారు IQAC కోఆర్డినేటర్ డాక్టర్ టి. అక్కిరాజు గారు, డాక్టర్ సిహెచ్ చైతన్య డాక్టర్. షేక్ పర్వీన్,డాక్టర్. జి వెంకటరమణ, అధ్యాపకేతర బృందం 100 మంది విద్యార్థిని విద్యార్థులు అందరు పాల్గొన్నారు.

గౌరవ ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పుప్పాల శ్రీనివాసరావు గారు మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన సైకిల్ షెడ్ ను రిబ్బన్ కట్ చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ మూర అలంకారం గారు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. Click for Invitation Brochure